నారద వర్తమాన సమాచారం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – జిల్లా SP జగదీశ్ ఆదహళ్లి
పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రానున్న మున్సిపాలిటీ, జడ్పీటీసీ ,ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ అదహల్లి ఐపీఎస్ శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలోని 8 మున్సిపాలిటీ, 28 మండలాలు, 34 పోలీస్ స్టేషన్ల పరిధిలో 525 గ్రామ పంచాయతీలకు సంబంధించి 5,476 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. తాజా సమీక్ష ప్రకారం అత్యంత సున్నితమైన, సున్నితమైన, సాధారణ పోలింగ్ ప్రాంతాలుగా వర్గీకరించారు. ఎన్నికల విధుల కోసం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు, తనిఖీ కేంద్రాలు, షాడో పార్టీలను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపడుతాము అని ఎస్పీ హెచ్చరించినారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్ లను బైండోవర్ చేశారు. ఎన్నికల విధుల కోసం, పోలీసు అధికారులను, పోలీసు సిబ్బందిని వినియోగించనున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా, అక్రమంగా గుమిగూడినా లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి ఐపీఎస్ హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు లేదా ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








