


నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ,ఆర్ధిక,ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, దాచేపల్లి కి చెందిన ముండ్ర సౌజన్య W/O షరీఫుద్దీన్, అను ఆమె 2014 సంవత్సరంలో షరీఫుద్దీన్ అను హోంగార్డును వివాహం చేసుకున్నట్లు, అతనికి ఇదివరకే పెళ్లి అయినట్లు ఆ విషయం తర్వాత తెలిసినట్లు, సదరు షరీఫుద్దీన్ మరల వేరే స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఫిర్యాది ఇచ్చిన రిపోర్టు.
వినుకొండ పట్టణం కి చెందిన ఆసా నరసింహారావు S/O సుబ్బారాయుడు అను అతనికి , నల్లగోర్ల వెంకటేశ్వర్లు అను అతను VRO ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి , 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు, ఉద్యోగం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వమని అడుగుగా చంపుతానని బెదరిస్తున్నట్లు ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్.
నరసరావుపేట పట్టణం లోని పెద్ద చెరువుకి చెందిన షేక్ సుభాని W/O అబ్దుల్ మజీద్ అను ఆమె, షేక్ ఖాదర్ వరుసకు బావ అయ్యే అతను తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పగా నమ్మి, లక్ష రూపాయలు ఇచ్చినట్లు ఉద్యోగం ఇప్పించకపోగా తిరిగి డబ్బులు అడిగినందుకు కొట్టినట్లు, న్యాయం చేయవలసినదిగా ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్.
విటంరాజుపల్లి గ్రామము, వినుకొండ మండలంకు చెందిన యాదల సుబ్బారావు w/o రోశయ్య అను అతనికి తన గ్రామములో 1.25 ఎకరము భూమి ఉన్నట్లు, ఆ భూమిని యాదల బాల వెంకటసుబ్బయ్య అను అతను ఆ పొలమును తన పేరు మీద ఎక్కించుకున్నట్లు, ఈ విషయం గురించి అడుగగా చంపుతానని బెదిరిస్తున్నట్లు రిపోర్ట్.
నరసరావుపేట పట్టణం కి చెందిన క్రాప్రా రాధా w/o హరికృష్ణ అను ఆమె బొడ్డు తిరుపతిరెడ్డి వద్ద నకిరేకల్లులో 38 లక్షలు ఇచ్చి భూమి కొనుగోలు చేసినట్లు, 2 సం. నుండి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి,నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయసహకారాలు అందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు దాతలు అన్నదానం ఏర్పాటు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








