నారద వర్తమాన సమాచారం
సత్తనపల్లి
రాజుపాలెం మండలం కుబాద్ పురం శివారు కోటనేమలి పూరి గ్రామంలో రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల వలన సమస్యలు 100% పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్ముతున్నారు.. ఇది కూటమి ప్రభుత్వం కార్యక్రమాలకు దక్కుతున్న ప్రశంస.
వైసిపి హయాంలో జరిగిన భూకబ్జాలు, ఆస్తుల ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా లభిస్తోంది.
గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వలన చాలా ఉపయోగంగా ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత పాలనలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నుంచి తమ వద్దకే భూ సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం పంపించడం ఎంతో మేలు చేసినట్టు ఉందని అంటున్నారు.
గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారులు దృష్టికి తీసుకురావచ్చు
ప్రజల ప్రభుత్వాస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది మీ భూమి కి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాటిస్తున్నాము
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








