నారద వర్తమాన సమాచారం
వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతుల హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభా వంతుల అసోసిఎషన్లకు అవసరమైన కార్యాలయాలను విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయములో వారి వారి కార్యాలయాలు ఉండే విధముగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని పి.జి.ఆర్.యస్ సమావేశ మందిరములో విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యములో విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల ఉన్నతికి ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధులు ప్రభుత్వాలు కల్పిస్తున్న వారి వారి హక్కులపై అవగాహన కల్పించడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం అన్నారు. విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం స్థానిక నరసరావుపెటలోని యస్.యస్.యన్ కాలేజి వద్ద ఉన్న ఖాళీ గా ఉన్న బి.సి. సంక్షేమ శాఖ భావనానికి మార్చే విధముగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందులోనే విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధులు అసోసియేషన్ లకు కార్యాలయం కేటాయించే విధముగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పులువురు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు ,వయో వృద్ధులు, విభిన్న ప్రతిబా వంతులు లేవనెత్తిన పలు అంశాలపై స్పందించన జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వయో వృద్ధులకు అవసరమైన చేతి కర్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. విభిన్న ప్రతిభా వంతులు విధిగా సర్టిఫికేట్ కై రిజిష్ట్రేషన చేసుకోవన్నారు. వారానికి ఒకసారి వయో వృద్ధులకు ప్రతి సోమ వారం పిర్యాదుల దినం రోజున బస్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభా వంతులు మూడు నెలలకొకసారి పించను తీసుకోవచ్చని తెలిపారు. ఆస్తులను పిల్లలకు పంచిన తదుపరి నిరాదరణకు గురైన తల్లి దండ్రులకు (వృద్ధులకు)నిభందల మేరకు న్యాయం జరిగేలా చూడటం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభా వంతులకు బ్యాంక్ ఖాతా సౌకర్యం పొందేలా చూడాలన్నారు. తొలుత విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త ఆ శాఖ ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమములో డి.ఆర్.డి.ఎ పి.డి బాలూ నాయకే, ఆసుపత్రుల సమంవ్యాదికారి డా.రంగారావు, యల్.డి.యం రాం ప్రసాద్, గ్రహ నిర్మాణ శాఖా అధికారి వేణుగోపాల్, జిల్లా విద్యా శాఖాధికారి చంద్రకళ సంబందిత శాఖల అధికారులు,తదితరులు పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








