నారద వర్తమాన సమాచారం
గంగా సమేత ఉమామహేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల:-
పిడుగురాళ్ల పట్టణంలో ఈరోజు
4/5/2025 న ఉదయం 10 గంటలకు గంగమ్మ గుడి ఆవరణలో శ్రీ గంగా సమేత ఉమామహేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని పూజలు నిర్వహించారు.
కళ్యాణ అనంతరం ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తిలో ను పూల అలంకరణ,విద్యుత్ దీపాలంకరణతో మహా గ్రామోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ టిడిపి అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసు, కనిగిరి శ్రీనివాసు, గంగమ్మ తల్లి గుడి అధ్యక్షులు కొక్కెర ఏడుకొండలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పట్టణ పెద్దలు తదితరులు అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








