నారద వర్తమాన సమాచారం
ఫ్రెండ్లీ పోలీసింగ్ కి నిర్వచనం తెలియజేసిన వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు సన్మానం చేసిన వన్ టౌన్ పోలీసులు
ఇదే పట్టుదలతో అనుకున్న లక్ష్యాలకు చేరుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించిన సీఐ విజయ్ చరణ్
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన పట్టణంలోని వరవకట్టకు చెందిన ముగ్గురు విద్యార్థులను నరసరావుపేట ఒకటవ పట్టణ సీఐ యమ్. విజయ్ చరణ్…. ఎస్సై వంశీకృష్ణలు వారి గృహాలకు వెళ్లి అభినందించింది అందరిమన్ననలు పొందారు.
ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలిసింగ్ ను నిర్వహించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించగా ఒకటవ పట్టణ పోలీసులు ఫ్రెండ్లీ పోలిసింగ్ కు నిర్వచనాన్ని తెలియజేసారు.
వివరాలలోకి వెళ్ళితే నరసరావుపేట ఒకటవ పట్టణ పోలిస్టేషన్ పరిధిలోని వరవకట్టకు చెందిన షేక్ హజీరా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 574 మార్కులు…. అలాగే మొహమ్మద్ సనా తయ్యబా 558 మార్కులు….. షేక్ హనీఫ్ 539 మార్కులు సాధించారు.
విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నరసరావుపేట ఒకటవ పట్టణ సీఐ ఎం.విజయ్ చరణ్ మరియు ఎస్సై వంశీ కృష్ణలు ఆదివారం ఉదయం వరవకట్ట లోని ముగ్గురు విద్యార్థుల నివాసాలకు వెళ్లారు.
ఈ సందర్బంగా పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని షేక్ హజీరా, మరో విద్యార్థిని మొహమ్మద్ సనా తయ్యబా, ఇంకొక విద్యార్థి షేక్ హనీఫ్ లను సీఐ ఎం. విజయ్ చరణ్, ఎస్సై వంశీకృష్ణలు విద్యార్థుల తల్లి దండ్రుల సమక్షంలో శాలువ కప్పి ఘనంగా సన్మానం చేసి పుస్తకాలు పెన్నులను బహుకరించి అభినందించారు.
ఈ సందర్బంగా ఒకటవ పట్టణ సీఐ ఎం. విజయ్ చరణ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులు షేక్ హజీరా, మొహమ్మద్ సనాతయ్యబా, షేక్ హనీఫ్ లను వారి తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేయటం చాలా సంతోషంగా గౌరవం గా ఉందని తెలియజేసారు.
మీరు సాధించిన అద్భుతమైన ఫలితాలు మీ తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఈ ప్రాంతానికి చాలా గర్వకారణం కలుగ చేసాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇదే పట్టుదల…. క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ మీరు అనుకున్న లక్ష్యాల దిశగా విజయం సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
నరసరావుపేట ఒకటవ పట్టణ పోలిస్టేషన్ పరిధిలోని వరవకట్టలో మరింత మంది విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి… మక్కువ కలిగించే విధంగా ముగ్గురు విద్యార్థులను శాలువా కప్పి ఘనంగా సన్మానించి పుస్తకాలు, పెనులు బహుమతిగా ఇచ్చామని సీఐ ఎం.వి చరణ్ తెలియజేసారు.
కార్యక్రమంలో ఎస్సై వంశీకృష్ణ, పోలీసు సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








