నారద వర్తమాన సమాచారం
ప్రజల హక్కుల బలోపేతమే లక్ష్యం
**నూతన సంవత్సర శుభాకాంక్షలు **
ఆర్ టి ఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు లింగస్వామి
ఎల్ బీ నగర్, , ప్రతినిధి, డిసెంబర్ 31:
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్‌టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ గ్రహీత, రాపోలు లింగస్వామి రాష్ట్ర ప్రజలకు, అధికారులకు,ఆర్‌టీఐ కార్యకర్తలకు, జర్నలిస్టులకు2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాపోలు లింగస్వామి మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజల హక్కులు మరింత బలపడే సంవత్సరంగా నిలవాలని ఆకాంక్షించారు. సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు శక్తివంతమైన ఆయుధమని పేర్కొంటూ ప్రతి పౌరుడు ఈ చట్టంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెంపొందించడంలో ఆర్‌టీఐ కార్యకర్తల పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వారు నిర్భయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే విధంగా జర్నలిస్టులు ప్రజల గొంతుకగా నిలబడి, సత్యం, న్యాయం కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు.
2026 సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి, సమృద్ధిని అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తన సేవలు కొనసాగిస్తామని రాపోలు లింగస్వామి స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







