నారద వర్తమాన సమాచారం
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు కలెక్టర్ కృతిక శుక్ల
అన్ని బంకుల్లో సమృద్ధిగా నిల్వలు అపోహలు నమ్మి వినియోగదారులు ఒక్కసారిగా రావడం వల్లే తాత్కాలిక సమస్య కలెక్టర్ కృతిక శుక్ల
అన్ని ఆయిల్ కంపెనీల ట్యాంకర్లు కూడా మరికొన్ని గంటల్లోనే జిల్లాకు చేరుకుంటాయి
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం… ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పెట్రోల్ బంక్ అవుట్ లెట్ల నందు స్టాక్ ఉండి వినియోగదారులకు సరఫరా చేయకుంటే సంబంధిత బంకులపై కఠిన చర్యలు తీసుకుంటాం..బల్క్ వినియోగదారుల కొనుగోళ్లపై నిఘా
పెట్రోల్ బంకుల వద్ద నిరంతర పర్యవేక్షణకు రెవెన్యూ, పోలీస్ అధికారుల నియామకం
పూర్తిగా డ్రైడ్ ఔట్ అయ్యే వరకు ఇంధన డీలర్లు వేచి చూడకుండా ముందుగానే ఇండెంట్ ఆయిల్ కంపెనీలకు పెట్టాలి
జిల్లాలో పలు మండలాల్లో జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్.ఎస్పీ పెట్రోల్ బంక్ ల ను విస్తృత తనిఖీ చేసారు
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు.
సోమవారం జిల్లాలో పలు మండలాల్లో జిల్లా కలెక్టర్ పెట్రోల్ బంక్‌ల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య సమాచారం, అపోహలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి కొరత లేదని, పుష్కలంగా డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మన జిల్లాకు నిరంతరంగా ఆయిల్ సరఫరా జరుగుతోందని, ఆయిల్ కంపెనీల ట్యాంకర్లు కూడా మరికొన్ని గంటల్లో జిల్లాకు చేరుకుంటాయని చెప్పారు.
ప్రజలు అపోహలకు లోనై అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవాలని ఆలోచించడం వల్లే సమస్య తలెత్తుతోందని, ఇది కొరత కారణంగా కాదని వివరించారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి బంక్ వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








