నారద వర్తమాన సమాచారం
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి:: గురజాల అప్పారావు
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం మాచర్ల పట్టణంలోని పెన్షనర్ అసోసియేషన్ భవనం నందు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో మొదటగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ కుక్కమూడి ప్రసాద్, దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి,
ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనేషన్ రాష్ట్ర అధ్యక్షులు
గురజాల అప్పారావు మాట్లాడుతూ మన్యం వీరుడు, విప్లవ యోధుడు,స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవటం గర్వంగా ఉందని ఆయన 1897, జూలై 4న అల్లూరి సీతారామ జిల్లా భీమునిపట్నం పాణ్యం గ్రామంలో జన్మించారని, 1924 మే 7న మరణించడం జరిగిందని;ఆయన 27 సంవత్సరాలు వయసులోనే
బ్రిటిష్ పాలకులను ఎదిరించి గిరిజన హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని యువత అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవటం జరిగింది.
కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకుడు కడియం అన్నారావు, సీనియర్ దళిత నాయకుడు దానియేలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








