నారద వర్తమాన సమాచారం
హరి కథ కళాకారుని కుమారుడు కుడికాలు శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేసిన ఎ.సి.పి. కిరణ్ కుమార్ ఐపిఎస్….
హరికథ కళాకారిణిగా సమాజంలో కళా సేవలో ఉన్నావనజ కుమారి కుమారుడు పి. హరీష్ కుమార్ కుడి కాలు కీలు అరిగిపోయి, నడవలేని పరిస్థితిలో వైద్యులను సంప్రదించగా, కీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమని, అందుకు ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్నప్పటికీ సుమారు రూ. 80,000 వరకు అదనపు ఖర్చు అవుతుందని చెప్పారు.
ఆ కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో పాలుపోని ఆపత్కాలంలో ఒక ఆశాకిరణంలా కనిపించిన వ్యక్తి హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసిపి కిరణ్ కుమార్ నా పరిస్థితిని వివరించిన వెంటనే, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి తన నేతృత్వంలోని ‘విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్’ సభ్యులతో మాట్లాడి, మాకు రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
సమయానికి వారు అందించిన ఆ చేయూత వనజ కుమారుడి శస్త్రచికిత్సకు చేయటకు ఎంతో ఊరటనిచ్చింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో వారు చూపుతున్న మానవత్వం, సేవా దృక్పథం నిజంగా అభినందనీయం. మా కుటుంబానికి అండగా నిలిచిన ఏసిపి కిరణ్ కుమార్ కి, అలాగే విశాల హృదయంతో సహకరించిన ‘విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్’ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సేవా కార్యక్రమాలు ఇలాగే మరిన్ని కొనసాగిస్తూ, మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను . వనజ కుమారి…….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








