నారద వర్తమాన సమాచారం
గంజాయి మత్తులోయువకుడి మర్మాంగాలు నలిపి హతమార్చిన స్నేహితులు….!
గంజాయి వ్యాపారంలో వివాదాలు, ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవ కారణంగా హత్య చేసినట్టు గుర్తింపు
హైదరాబాద్ – పసుమాములలో తన తల్లితో కలిసి నివసిస్తూ, గంజాయికి బానిసగా మారి గంజాయి వ్యాపారం కూడా చేస్తున్న నిషాని సుహాస్(22) అనే యువకుడు
గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తుండగా, కొడుకు తప్పుదోవ పడుతున్నాడని, భర్త చనిపోయినా కూతురు పెళ్లి చేసి, పసుమాములలో సొంత ఇల్లు కొని అక్కడికి మకాం మార్చిన సుహాస్ తల్లి
ఫోన్ లేకపోవడంతో తన స్నేహితులు రాకేష్, పరుశురాం, రాజులలో ఒకరి ఫోన్ తీసుకొని, ఇన్స్టాగ్రామ్ ద్వారా అతని లవర్‌కు అసభ్యకర మెసేజెస్ పంపడం మొదలు పెట్టిన సుహాస్
సదరు యువతి ఈ విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పడంతో, సుహాస్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న అతని స్నేహితులు
గతంలో గంజాయి వ్యాపారంలో వారి మధ్య ఉన్న లావాదేవీల వివాదాలు బయటికి తీసి, సుహాస్‌తో గొడవ పెట్టుకోసాగిన యువకులు
బుధవారం తెల్లవారుజామున పసుమాముల వెళ్లి, మాట్లాడాలని సుహాస్‌ను ఊరి శివారులో ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకెళ్లి దాడి చేసిన రాకేష్, పరుశురాం, రాజు, మరో వ్యక్తి
భయంతో పారిపోతున్నా కూడా వదలకుండా, వెంటపడి సుహాస్ మర్మాంగాలు నలిపి చనిపోయేవరకు కొట్టి, అక్కడే వదిలేసి వెళ్ళిన నిందితులు
సుహాస్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, ఇతరుల కోసం గాలిస్తున్న పోలీసులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








