నారద వర్తమాన సమాచారం
రొంపిచర్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐపీయస్ .
రానున్న ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు చేపట్టారు.
రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను మరియు చుట్టూ ఉన్న పరిసరాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు, వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని శాంతి భద్రత ల గురించి ఆరాదిశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలి.చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలి.
రానున్న స్థానిక ఎన్నికల నిమిత్తం సిబ్బందికి కేటాయించిన గ్రామాలలో సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరిస్తూ ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ సర్కిల్ CI M .V. సుబ్బారావు రొంపిచర్ల SI లోకేశ్వర రావు మరియు సిబ్బంది పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








