నారద వర్తమాన సమాచారం
ప్రైవేట్ పాఠశాల బస్సులపై పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు ప్రత్యేక తనిఖీలు
పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులపై పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పిడుగురాళ్ల మార్కెట్ యార్డులో పాఠశాల బస్సులను తనిఖీ చేసి, బస్సుల కండిషన్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సీఐ పలు సూచనలు చేశారు. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకెళ్లడం, నిర్ణీత వేగ పరిమితులను పాటించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే బస్సుల కండిషన్ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఐ వెంకటరావు సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








