నారద వర్తమాన సమాచారం
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు కేంద్రం బోనస్ ను ప్రకటించింది.
ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు.
సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాలి..
దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా, దీపావళి శుభాకాంక్షలను కిషన్ రెడ్డి తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








