నారద వర్తమాన సమాచారం
కమ్మ వారైనా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిందే..
లేదంటే బయటకు లాగి తంతాం..
మాదలలో మంత్రి అంబటి రాంబాబు కనుసన్నల్లో వైకాపా శ్రేణుల అరాచకం..
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని మాదల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బరి తెగించారు.
తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఇళ్లల్లోకి చొరబడి మరి హోమ్ ఓటింగ్ మీ ఇష్టం వచ్చినట్లు కాదు.. మేము చెప్పినట్లు వేయాలంటూ అధికారుల బృందం ముందే వయో వృద్ధుడిపై దౌర్జన్యానికి దిగారు.
ఈ అరాచకం ఏంటని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు.
రెడ్డి సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకమై మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఇళ్లపైకి రాళ్లు వేశారు.
పోలీసులు ఆపుతున్న వారిని నెట్టుకుంటూ కర్రలు, రాళ్లతో తెదేపా మద్దతుదారులపై దాడికి వచ్చారు.
తెదేపా మద్దతుదారులు ఐదుగురిపై మారణాయుధాలతో దాడి చేశారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
హోమ్ ఓటింగ్ లో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పై తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు
బాధితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.