నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్
మే :20
రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు..క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీకాంత్
రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు. తప్పుడు కథనాలను నమ్మకండి
బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను.
నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి.
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలదేని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం అన్నారు.
రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు’’ అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.