నారద వర్తమాన సమాచారం
తెలంగాణ అగ్నిమాపక, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వేళ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రథమ లక్ష్యంగా.. రెస్పాన్స్ టైమ్ను మరింత తగ్గించి, ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సేవలందిస్తాం.
పట్టణీకరణకు అనుగుణంగా ఫైర్ సేప్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం.
అదేవిధంగా, రాష్ట్ర సచివాలయం సహా కీలక ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పిస్తున్న ఎస్పీఎఫ్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్ఠం చేస్తాం.
సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ.. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ద్వారా రెండు విభాగాల్లోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ఫ్రొఫైల్స్ను సిద్ధం చేస్తాం.
క్రమశిక్షణ, పారదర్శకతతో ఒక బృందంలా కలిసికట్టుగా పనిచేసి అత్యుత్తమ సేవలందిస్తాం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








