ఆంద్రప్రదేశ్
పేదల జీవనాన్ని మెరుగుపరిచిన సంక్షేమం.
జగనన్నకు ఓటు వేద్దాం సంక్షేమాన్ని కొనసాగిద్దాం
రెడ్డిగూడెం నాయకులతో మంత్రి అంబటి
నారద వర్తమాన సమాచారం :రాజుపాలెం:ప్రతినిధి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన పారదర్శక సంక్షేమ పథకాలు పేదల జీవన విధానాన్ని మెరుగుపరిచాయని, ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి ఆయన బుల్లెట్ పై ద్విచక్ర వాహన ర్యాలీతో యాత్ర సాగించారు. అంబటి వెంట నియోజకవర్గ అశేష వైయస్సార్సీపి సైన్యం తరలి వెళ్ళింది. భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ఆయనను అనుసరించారు.
రెడ్డిగూడెం గ్రామం వద్ద స్థానిక నాయకులు, మహిళలు, ముస్లిం మైనార్టీ వర్గాలు విశేష సంఖ్యలో ఎదురేగే ఆయనకు స్వాగతం పలికారు. జై జగన్, జై అంబటి అంటూ నినాదాలతో హోరెత్తించారు. భారీ జండాలు చేత బూని, ఫ్యాను గుర్తు సంజ్ఞలతో హుషారెట్టించారు. అనంతరం అంబటి నాయకులు భాషా నివాసములో స్థానికులతో మాట్లాడారు. రెడ్డిగూడెం గ్రామానికి జగనన్న ప్రభుత్వ హయాంలో రూ. 16.78 కోట్ల సంక్షేమాభివృద్ధి నిధులు అందాయన్నారు. ఈ సంక్షేమాన్ని గడప వద్దకే చేర్చిన సుపరిపాలనను, ప్రతి సామాజిక వర్గానికి చేసిన మేలును మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వివరించారు. స్థానిక సమస్యలపై చర్చించారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని లోపాలు సరిదిద్దుకొని, ఐక్యంగా, సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఆయనతోపాటు గ్రామ , మండల , నియోజకవర్గస్థాయి నాయకులు , ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.