ఆంద్రప్రదేశ్
తుమ్మలపాలెంలో నేత్రపర్వంగా రామాలయ ప్రతిష్ట.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు.
నారద వర్తమాన సమాచారం :ఇబ్రహీమ్ పట్నం: ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి నూతన ఆలయ బింబ ధ్వజప్రతిష్ఠ మహోత్సవం బుధవారం ఉదయం నేత్రపర్వంగా జరిగింది.ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బుధవారం మధ్యాహ్నం ఆలయానికి విచ్చేసిన మైలవరం నియోజకవర్గ బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్వామివారిని, దేవతా మూర్తులను దర్శించుకున్నారు. ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు.శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మాట్లాడుతూ . కోదండరామస్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కృష్ణప్రసాదు ని ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.