వైఎస్సార్సీపీలో చేరిన తమ్మవరం టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
నరద వర్తమాన సమాచారం:పెదకూరపాడు:ప్రతినిధి
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన టీడీపీ గుడేటి బసవయ్య, జగ్గవరపు భరత్, గుడేటి ఏసురత్నం, నందిగం పెద్దోడు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుస్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.