*ఎన్నికల కోడ్ దృష్ట్యా జిల్లా ఎక్సైంజ్ ఆద్వర్యంలో నాటుసారా తయారీ దారులులపై దాడులు
నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
సూర్య పేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం
ఎన్నికల కోడ్ దృష్ట్యా జిల్లా ఎక్సైంజ్ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్ ఆదేశాలు మేరకు హుజుర్నగర్ ఎక్సైంజ్ సిబ్బంది నిర్వహించిన దాడులలో మూడు ద్విచక్ర వాహనాలతో పాటు 8 లీటర్ల సారా,80 కిలోల బెల్లం స్వాధీనం చేసుకొని పలువురి ని అరెస్ట్ చేయడం జరిగింది.*
మేళ్ళచెర్వు మండల కేంద్రంలో హేమ్లా తండా కు చెందిన ధరవత్త్ బాలా ను నుండి 8 లీటర్ల సారా తో పాటు హీరో హోండా గ్లామర్ బండి ని సీజ్ చేయడం జరిగింది.
గరిడేపల్లి మండల కేంద్రంలో మంగాపురం తండా కు చెందిన పెరబోయిన రాకేష్ మరియు కోదాడ బీక్య తండా కు చెందిన భూక్య శాంతి లు హుజుర్నగర్ నుండి 80 కిలో ల బెల్లంను సారా తయారీ కోసం తరలిస్తుండగా వారి వద్దనుండి బెల్లం తో పాటు బజాజ్ బైక్ మరియు హీరో గ్లామర్ బైక్ ని సీజ్ చేసి వారి పై కేస్ నమోదు చేయడమైనది. వీరికి బెల్లం అమ్మిన నూకల భాస్కర్ రావు పై కూడా కేస్ నమోదు చేసి అరెస్ట్ చేయడమైనది.
ఇట్టి దాడులలో ఎస్సై లు దివ్య, వెన్నెల, గోవర్ధన్ ల తో పాటు సిబ్బంది రుక్మా రెడ్డి, నరేష్,దనుంజయ్, రవి, నాగరాజు లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.