
నారద వర్తమాన సమాచారం:డిల్లీ:ప్రతినిధి
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది.
డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, సి యమ్ అన్న కారణాలతో విచారణ జాప్యం కావొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.
విచారణ ప్రక్రియ వేగంగా జరగాలని సీబీఐని ఆదేశించిన కోర్టు.. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.








