


నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి
కస్తాల గ్రామ ప్రజల కష్టాలు తీరుస్తా భాష్యం ప్రవీణ్.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలంలో గల కస్తాల గ్రామంలో భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కస్తాల ప్రజలను ఉద్దేశించి ప్రజల కష్టాలను తీరుస్తాను అన్నారు. గ్రామ పురవీధుల్లో కస్తాల గ్రామ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, జనసేన, నాయకులు బిజెపి నాయకులు, భాష్యం ప్రవీణ్ గారిని భారీగా ఊరేగించారు. రాబోయే ఉమ్మడి కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుందని తెలిపారు. మీ మీద ఉన్న కేసులను ఎత్తేస్తామని అభయమిచ్చారు. కొత్తవాడినైనా నన్ను ఎన్నికల్లో దీవించి గెలిపించాలని కోరారు. సమయం లేదు కాబట్టి మరోసారి వస్తానన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలను నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం- జనసేన- బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.








