నారద వర్తమాన సమాచారం
ఎం.సి.హెచ్ బ్లాక్ మార్పిడి విషయంపై తన చాంబర్లో సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
సమావేశంలో ఎంసిహెచ్ బ్లాక్‌ను మార్చే షెడ్యూల్ గురించి జిల్లా కలెక్టర్ చర్చించారు.
మే 5న వచ్చే లేబర్ రూమ్,స్వాబ్ పరీక్ష ఫలితం ప్రకారం మే 6న కొత్త ఆసుపత్రికి మార్చు తారని, మే 7 నుండి (గైనకాలజీ మరియు పీడియాట్రిక్స్) మాతా శిశు సేవల వైద్య విభాగం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అనుమతించారు.
టి.బి. విభాగాన్ని లింగం గుంట్లలోని కొత్త ఆసుపత్రి నుండి పాత ఆసుపత్రికి మార్చేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
డ్రైనేజీ పనుల కోసం రోడ్డును కోయడం మరియు పూడ్చడం సంబంధిత పనులను ఆదివారం రాత్రి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతి ఇచ్చారు.ఈ పనులు ఏ.పీ.ఎం.ఎస్.ఐ.డీ.సీ ద్వారా చేపట్టబడతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ కో ఆర్డినేటర్ (డి సి హెచ్) డాక్టర్. ఎం ప్రసూన, (ఏ.పీ.ఎం.ఎస్.ఐ.డి. సి)డాక్టర్. కే. హేమంత్ కుమార్ నాయక్,(డి.సి. హెచ్.ఎస్, ఫార్మసీ ఆఫీసర్.)సురేష్ బాబు, ఎం వెంకట భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








