నారద వర్తమానసమాచారం :నెల్లూరు:ప్రతినిధి
మేమంతా సిద్ధం డే9- నేటి స్టార్ క్యాంపెయినర్
సీఎం జగన్ కాన్వాయ్ నేడు నెల్లూరు జిల్లాలోని కోవూరు, కావలి అసెంబ్లీ నియోజక వర్గాలకు చింతారెడ్డి పాలెం మార్గంలో వెళ్తుండగా, తనని పలకరించటానికి వచ్చి రోడ్డుపై వీల్ చైర్ పై ఉన్న బాలుడిని సీఎం జగన్ గమనించి వెంటనే కాన్వాయ్ ఆపి, దిగివచ్చి ఆ బాలుడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే
కుమ్మరకొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంట జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక, నడక రాక అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. తల్లి రాణమ్మ ఇంత వరకూ లక్షలు ఖర్చు చేసినా, ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. భర్తను కూడా పోగొట్టుకుని, కొడుకు వైద్యం కోసం ఇక ఖర్చు చేయలేని పరిస్థితిలో సహాయం చేయమని సీఎం వైఎయస్ జగన్ కు విజ్ఞప్తి చేసుకుంది.
జయకృష్ణ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం ఆమెకు భరోసా కల్పించారు. జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు. ఇంతటి రద్దిలో కూడా సీఎం జగన్ ఒక తల్లి ఆరాటాన్ని గమనించి, వికలాంగా బాలుడికి బాసటగా నిలిచారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.