నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
కొత్తపల్లి లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట మండలం కొత్తపల్లిలో టీడీపీకి చెందిన 15 కుటుంబాల వారు.. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్త లభిస్తోందన్నారు. ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి తనను ఆదరిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో తెల్లమేకల అంకమ్మారావు,తెల్లమేకల మహాలక్షమమ్మ, తెల్లమేకల నాగరాజు, తెల్లమేకల కోటేశ్వరీ, తెల్లమేకల చిన్న సుబ్బారావు,తెల్లమేకల సురేంద్ర,చేపూరి పోతులురయ్య,
రాజేశ్వరి,వెంకట బ్రహ్మచారి ఉపేంద్ర,తంగెళ్లపల్లి కుమారి, చిమ్మట మల్లేశ్వరి, నడింపల్లి మోహన్ రావు, రాజ్యలక్ష్మి తదితరులున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.