అప్రజాస్వామ్యక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం.
ఏపీని రక్షించడానికే మహాకూటమి ఏర్పడింది.
మహాకూటమికి అఖండ విజయాన్ని అందించండి.
మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో రచ్చబండ ఆత్మీయ సమావేశం.
నారద వర్తమాన సమాచారం జి.కొండూరు ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అప్రజాస్వామ్యక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీని రక్షించడానికే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, మహా కూటమికి అఖండ విజయాన్ని అందించాలని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలో రచ్చబండ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ. తను ఏ పరిస్థితుల్లో వైకాపాను వీడాల్సి వచ్చిందో వివరించారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. పన్నులు విపరీతంగా పెంచారన్నారు. మద్యం, ఇసుక ధరలు పెరిగాయన్నారు. అమరావతిని నాశనం చేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సి, ఎస్టీ సోదరుల అభ్యున్నతికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. విదేశీ విద్య రద్దు చేశారన్నారు. వైకాపా పాలనలో విద్యుత్ చార్జీలు పెరిగి ఏపీకి పరిశ్రమలకు రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాలేదనన్నారు. యువత భవిష్యత్తు నిర్వీర్యమైందన్నారు.
మహా కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. సంపదను సృష్టించి పేదలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామన్నారు.ఇది చాలా కీలక సమయం..ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు. మూడు జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మైలవరం నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఘనవిజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీకి ఘనస్వాగతం లభించింది. పూలు జల్లుతూ ఆయన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనస్పందన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.