నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పల్నాడు జిల్లా,
శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన ఉండాలి* కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
లోతేటి శివశంకర్
సాధారణ ఎన్నికల నేపథ్యంలో పిఓలు, ఏపీఓలు, సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్‌లో జరిగిన సాధారణ ఎన్నికలపై పిఓలు, ఏపీఓలు, సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లుకు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయీ శిక్షణా కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల కోసం పిఓలు, ఏపీఓలు, సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లుకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో శిక్షణా కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని, ఎన్నికల్లో పిఓలు, ఏపీఓల పాత్ర ఎంతో కీలకమన్నారు. శిక్షణలో అందించే ప్రతి అంశంపై పూర్తి స్పష్టతతో తెలుసుకొని ఉండాలన్నారు. సజావుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు.ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అందజేసిన పిపిటి–హాండ్ బుక్ పూర్తిగా చదివి అర్థం చేసుకుని, ఈవీఎం మిషన్లలో బాలెట్ యూనిట్, వివి ప్యాడ్, కంట్రోల్ యూనిట్ అనుసంధాన ప్రక్రియ, పోలింగ్ డే రోజు మాక్ పోల్ ప్రక్రియ, ముఖ్యంగా పలు పత్రాలు నింపే విధానం గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ఇది వరకు ఎన్నో ఎలక్షన్ విధులు చేశాం అనే నిర్లక్ష్యం చూపవద్దని, ప్రతి సారి ఈసీఐ కొత్త కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నదని వివరించారు. ఎలాంటి సందేహాలు ఎదురైనా నోట్ చేసుకుని పై అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు.
మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎం ఆపరేట్ చేయడం, ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలను.. ప్రీ పోల్, పోలింగ్ దాని తర్వాత చేయాల్సిన పనులను నిబంధనలను సంపూర్ణంగా వివరించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రిసైడింగ్ అధికారులు చేయవలసినవి, చేయకూడనివి స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వో , పిఓలు, ఏపీఓలు, సెక్టార్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.