నారద వర్తమాన సమాచారం
తెదేపాకి ముస్లింల ఓటు ఒక్కటీ పడకూడదు.
నియోజకవర్గంలో మైనార్టీల అభివృద్ధికి కృషి చేశా
షాదిఖానా ల నిర్మాణానికి హామీ
నందిగంలో పర్యటిస్తున్న మంత్రి అంబటి
సత్తెనపల్లి
ముస్లిం మైనారిటీల ఓటు ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి పడకూడదని రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నియోజకవర్గ వైయస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. శనివారం మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం మార్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ముస్లిం మైనార్టీల వర్గాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానన్నారు. గుండ్లపల్లిలో రూ. 50 లక్షలు, కొండమోడులో రూ.30 లక్షలతో షాదీ ఖానాల నిర్మాణానికి కృషి చేశామన్నారు. పట్టణములో 50 సంవత్సరాలుగా ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటున్న రూ.9.50 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో అందించామన్నారు. దానికి అవసరమైన ప్రభుత్వ రుసుము రు లక్ష కూడా మీ తరఫున నేనే చెల్లించానని వివరించారు. ముస్లిం సోదరులు అధికంగా ఉన్న నందిగం ,పెదమక్కెన గ్రామాల్లో రానున్న మన ప్రభుత్వ హయాంలో షాదిఖానాలు నిర్మించేందుకు హామీ ఇస్తున్నానన్నారు. రూ. 20 నుంచి 30 లక్షల లోపు నిధులు సమీకరిస్తారని వారికి మాట ఇచ్చారు. నందిగం గ్రామంలో ఈసారి మెజార్టీ మనకు రావాలన్నారు.
ఈనెల 25వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నానని ,ఈ గ్రామం నుంచి అన్ని వర్గాల ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ సత్తెనపల్లికి తరలి రావాలన్నారు. ముందుగా ఆయన గ్రామంలోని ముఖ్య నేతల నివాసాలకు వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి సమీక్షించారు .నామినేషన్ కు జన సమీకరణ పై వారితో మాట్లాడారు. కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు , స్థానిక నాయకులు , ప్రజాప్రతినిధులు వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.