నారద వర్తమాన సమాచారం
మలేరియా పై ప్రజల్లో అవగాహన అవసరం
వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్
మలేరియా వ్యాధి దోమ కాటు వలన వచ్చే వ్యాధి అని, ఎనాఫిలాస్ జాతికి చెందిన ఆడ దోమ కాటు తో ఈ వ్యాధి వస్తుందని ఈ వ్యాధి ఎక్కువగా పారిశుద్ధ్య లోపం సరైన ఆరోగ్యకర జీవన పరిస్థితులు లేకపోవటం వంటి కారణాలవల్ల మలేరియా విజృంభిస్తుందని పల్నాడు జిల్లా క్రోసురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని బాల అంకమ్మ బాయ్ అన్నారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధి తీవ్రమైన చలి జ్వరం వణుకుతో మొదలై సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే చివరికి మెదడుకు ఇతర శరీర అవయాలకు సోకి రోగిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుందని ఆమె పేర్కొన్నారు కావున మలేరియా వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నారు ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సంప్రదించాలన్నారు మలేరియా వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు ఈ సంవత్సరం థీమ్ “మెరుగైన ప్రపంచం కోసం మలేరియా పై పోరాటాన్ని వేగవంతం చేద్దాం”అన్న అంశం అని పేర్కొన్నారు దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి ఆయన వివరించారు నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, వెంటిలేటర్లకు నెట్ అమర్చుకోవాలని, వారానికి ఒక రోజు అనగా ప్రతి శుక్రవారం ప్రజలందరూ డ్రైడేను విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సిరి చందన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లో వాడిన టీ డిస్పోజల్ కప్పులు ఇతర నీటి నిలువలు గల చిన్న పాత్రలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరిచి నీటిని నింపుకోవాలని ఆమె తెలిపారు
చేద్దాం చేద్దాం మలేరియాపై పోరాటం చేద్దాం, మలేరియా రహిత సమాజమే ప్రపంచ మలేరియా దినోత్సవ ముఖ్య ఉద్దేశం, చిన్న ప్రాణులు పెను ప్రమాదం, దోమల నియంత్రణ మనందరి బాధ్యత, ఫ్రైడే డ్రై డే , పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సిబ్బంది నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు బాల అంకమ్మ భాయ్ సిరి చందన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్, ఆరోగ్య పర్యవేక్షకులు శివుడు అమర జ్యోతి ప్రభావతి , ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.