బృగుబండలో
తెదేపా, జనసేన ల నుంచి చేరిన 4 గురు నాయకులుపార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి అంబటి
నారద వర్తమాన సమాచారం
వైయస్సార్సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
బృగుబండలో
తెదేపా, జనసేన ల నుంచి చేరిన 4 గురు నాయకులు
పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి అంబటి
సత్తేనపల్లి
వైయస్సార్సీపీకి గేమ్ చేంజర్ గా మారిన మేనిఫెస్టో ప్రకటన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. దీనికి తోడుగా నియోజవర్గంలో అంబటి రాంబాబు విస్తృతంగా చేస్తున్న పర్యటనలతో పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. శుక్రవారం మండల పరిధిలోని బృగుబండ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నుంచి నలుగురు నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. వారికి రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు , నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు స్వయంగా పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన జనసేన నాయకులు గంపలహరి, తెలుగుదేశం పార్టీకి చెందిన మేకల వెంకటరావు, బాడుగుల రాంబాబు, తోరటి నరసింహారావు లకు పార్టీ కండువాలను కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబటి మాట్లాడుతూ రానున్నది ఫ్యాన్ ప్రభంజనమేనని , గెలుపు వైయస్సార్సీపి దేనని అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని ఇదే సంక్షేమ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన వివరించారు. పార్టీలో చేరిన వారికి సమచిత స్థానం గౌరవిస్తుందన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.