నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాం
ఘన స్వాగతం పలికిన నరసింగపాడు మరియు గుండ్లపల్లి గ్రామ కార్యకర్తలు ప్రజలు నాయకులు
ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వెయ్యాలని సాగిన ప్రచారం
నకరికల్లు మండలం నరసింగపాడు, గుండ్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ
నరసింగపాడు మరియు గుండ్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా గారు అభ్యర్థించారు
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు*
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై కన్నా మాట్లాడుతూ… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే కూటమి ప్రభుత్వం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తుంది. విధ్వంసపు వైకాపా పాలనలో చితికిపోయిన ఏపీ ప్రజల భవిష్యత్తును. తీర్చిదిద్దేలా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ సంక్షేమం కల్పించే అంశాలతో. కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఆదాయం పెంచాలి పేదలకు పంచాలనే విధానంతో. మేనిఫెస్టోను ప్రజలు ముందుకు తీసుకువచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేయడమే.ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఎజెండా. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల స్థిరాస్తులకు అత్యంత ప్రమాదకారిగా మారిపోతుంది.మనం జీవితాంతం కష్టపడి సంపాదించి కొనుక్కున్న చిన్నపాటి ఆస్తిపై కూడా. మనకు హక్కులు లేకుండా చేసేందుకు ఈ చట్టాన్ని రూపొందించాడు.జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసేందుకు పెడతాం. జగన్ ఐదేళ్ల దుష్ట పాలనలో. నవ్యాంధ్ర విధ్వంసానికి గురైంది.రాష్ట్ర పునర్నిర్మానం జరగాలంటే జగనాసుర వద జరగాల్సిందే. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి.సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు..
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.