Friday, May 22, 2026
spot_img

జిల్లాలో జనగణన కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలి. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ….

నారద వర్తమాన సమాచారం

జిల్లాలో జనగణన కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలి. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ….

తాళం వేసిన ఇళ్ల యజమానుల వివరాలను ఫోన్ ద్వారా సేకరించాలి.

జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని పూర్తిచేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. జనగణన పురోగతిపై అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రగతి చూపించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు 70 శాతం కన్నా తక్కువగా గణన పూర్తి చేసిన అధికారులు అందుకు గల కారణాలను తెలియజేసి, శుక్రవారం లోగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు.
తహసీల్దార్లు ఇండ్ల గణన సమయంలో అనేక ఇళ్లు తాళం వేసి ఉన్నాయని సమస్యను ప్రస్తావించగా, వాటిపై స్పందించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ తాళం వేసిన ఇళ్ల యజమానుల ఫోన్ నెంబర్లు పక్కవారిని అడిగి సేకరించి, ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రత్యేక అధికారులందరూ వచ్చే వారం తమ మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కనీసం మూడు రోజుల పాటు గ్రామాల్లో పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. యాదృచ్ఛికంగా ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లను స్వయంగా పరిశీలించి, గణన సక్రమంగా జరుగుతోందో లేదో నిర్ధారించాలన్నారు.అలాగే తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు గణన సిబ్బందిని సమన్వయం చేసుకొని పని చేయాలని, గ్రామాల్లో ఇంకా జనాభా గణనలో లోటుపాట్లు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు జనాభా ఆధారంగా విడుదలవుతాయని, అందువల్ల ఒక్క కుటుంబం కూడా మిగలకుండా గణన పూర్తిచేయాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చోట జనాభా నమోదు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గణన పరిధిలో కనీసం 25 నుంచి 50 ఇళ్ల వరకు తిరిగి పరిశీలించాలని సూచించారు.ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్ల పరిశీలనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పని చేయాలని అధికారులకు సూచించార


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading