నారద వర్తమాన సమాచారం
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం తగలబడిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులు
నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాష్ నగర్ 3వ లైన్ వద్ద రోడ్డు పక్కన నిల్వ ఉంచిన అండర్ డ్రైనేజ్ (భూగర్భ మురుగునీటి వ్యవస్థ) పైపులకు అకస్మాత్తుగా నిప్పు అంటుకుంది. ప్లాస్టిక్ పైపులు కావడంతో మంటలు క్షణాల్లో వ్యాపించి, ఆకాశాన్నంటుతూ భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








