నారద వర్తమాన సమాచారం
ఎండ తీవ్రతపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా ఇంచార్జి కలెక్టరు సంజన సింహ …
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్త ల పైన పలుసూచనలు జారీచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టరు మాట్లాడుతూ అత్యవసరం అయితేనే మధ్యాహ్న సమయంలో బయటకు రావాలని రాష్ట్ర వాతావరణశాఖ హెచ్చరికలు నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకూ తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలు నుండి సాయత్రం 4 గంటలు వరకూ అత్యవసరం అయితేనే బయటకు రావాలని అన్నారు. అయితే బయటకు వచ్చేవారు తగినంత త్రాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలను గుర్తించాలని అన్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలను అధిక దాహం, తలనొప్పి, వాంతులు, అలసట అటువంటి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లో ఉన్న వైద్యకేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఎండ తీవ్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఎటువంటి చిన్న పొరపాటు చేసినా ఎండ తీవ్రత వలన తీవ్రఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, తదితర పంటలు, మూగజీవాలను నీటిఎద్దడి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ముఖ్యమైన కూడలిలో చలి వేంద్రాలు, బస్సు కోసం నిలిచే ప్రయాణికులకు తాత్కాలిక పందర్లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ఎస్ఎస్సి, తదితర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వెళ్ళుటకు, వచ్చుటకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వేసవిలో కరెంటు కోతలు, లోవోల్టేజీ లేకుండా విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చెయ్యాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, పెద్ద పరిశ్రమలు రసాయనిక పదార్థాలు దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తెలిపారు. పొలాల్లో వివిధ రకాలు వ్యర్థాలు కాల్చకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, తాగునీటి సరఫరా, వైద్యసేవలు తదితర అంశాలుపై ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా చూడాలని అన్నారు. వడదెబ్బ కేసులు నమోదు కాకుండా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్లు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కార్మికులు, వృద్ధులు, చిన్నారులు ఎండ ప్రభావానికి గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








