నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
రాష్ట్రం మన రాజధాని మన భవిష్యత్తు మనమే నిర్మించుకుందాం
ఘన స్వాగతం పలికిన తురకపాలెం మరియు దమ్మాలపాడు గ్రామ కార్యకర్తలు ప్రజలు నాయకులు
ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వెయ్యాలని సాగిన ప్రచారం
ముప్పాళ్ళ మండలం తురకపాలెం ,దమ్మాలపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ
తురకపాలెం మరియు దమ్మాలపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ లావు శ్రీకృష్ణదేవరాయలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా అభ్యర్థించారు
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15 వేలు రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై కన్నా మాట్లాడుతూ…ఒక రాజధాని నిర్మించే సత్తా లేనోడు మూడు రాజధానులు కడతా అన్నాడు చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే 20 లక్షలు ఉద్యోగాలు క్రమ పద్ధతిలో. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రెండింతలు పెరుగుతుంది. ఓటు వేసే ముందు యువత తమకు ఎలాంటి భవిష్యత్తు కావాలో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండాలని మనస్తత్వం జగన్ రెడ్డి ది.అందుకే తనకోసం ప్యాలెస్లు కట్టుకునే జగన్ రెడ్డి. పేదల కోసం మాత్రం ఇరుకిళ్లు ఇస్తాడు దీన్నే పెత్తందారి పోకడ అంటారు. కావున మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.