

నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి
సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం మరియు కంటేపూడి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థికన్నా లక్ష్మీనారాయణ . మరియు లావు శ్రీ కృష్ణదేవరాయలు సోదరి, లావు రుద్రమదేవి
ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోతున్నట్లే..
రాజధాని అమరావతితో ఈ ప్రాంత అభివృద్ధిని ప్రజలు కోరుకోవాలి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోతున్నట్లే అని ప్రజలు అర్థం చేసుకోవాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
సత్తెనపల్లి మండలంలోని కంటేపూడి నందిగామ గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తానని నమ్మించి జగన్మోహన్ రెడ్డి 2019లో ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల్ని మోసం చేశాడన్నారు.
చంద్రబాబుకు రాజధాని లో ఇల్లు లేదని తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నానని చెప్పి తన దోపిడి దొంగల ముఠా తో అసత్యాలు చెప్పించి అమరావతిని నాశనం చేసే కుట్రను 2019 నుంచి అమలు చేశాడన్నారు.
అమరావతి అభివృద్ధి చెందకపోవడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములు, స్థలాల ధరలు గత ఐదేళ్లలో ఊహించని విధంగా పడిపోయి పేద మధ్యతరగతి జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు.
రాజధాని నిర్మాణం జరిగితే సత్తెనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు.
ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి ని కోరుకునేవారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అమరావతిని రాజధానిగా కోరుకోవాలి అన్నారు.
రాజధాని రైతుల ఉసురు వైకాపా ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అమరావతి రైతులకు అండగా ఉన్నారని కన్నా చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పారని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమై ఉద్యోగ, ఉపాధి విప్లవ వస్తుందన్నారు.
గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో సత్తెనపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు.
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.