నారద వర్తమాన సమాచారం
బెల్లంకొండలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం
సంక్షేమ పాలనకు జనం నీరాజనాలు
సీఎం జగన్ పాలనలోనే పేదలకు మంచి జరిగింది: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
చంద్రబాబు వస్తే మళ్లీ పథకాలు ఆగిపోతాయి
జగన్ పాలనలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు వచ్చాయి
స్కూళ్లు బాగుపడ్డాయి, ఆస్పత్రులు బాగుపడ్డాయి, రోడ్లు బాగుపడ్డాయి
దళారీలు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోకి డబ్బులు
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వినతి
వివక్షత లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమాన్ని అందించడంతో పల్లె గుండెల నిండా వైసీపీ జెండానే రెపరెపలాడుతోంది.. పారదర్శక సంక్షేమానికి జేజేలు పలుకుతోంది. ఊరు ఊరంతా కదిలి వచ్చినట్టు నంబూరు శంకరరావు ప్రచారంలో జననీరాజనం పలుకుతోంది. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బెల్లంకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలుకారు. మహిళలు ఎదురేగి హారతులిచ్చారు. వైసీపీ జండాలు చేతబూని ప్రచారరథం వెంట పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోని గేమ్ చేంజర్ గా మారిందని వివరించారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదన్నారు అందుకు చంద్రబాబునాయుడు చరిత్ర కారణమన్నారు. 2014లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయని చంద్రబాబు నాయుడు మళ్లీ కొట్టాల పని అధికారం పేజి ఎక్కించుకోవాలని చూస్తున్నారన్నారు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన జగనన్న గెలిపించాలని అభ్యర్థించారు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి పెదకూరపాడులో తనను, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.