నారద వర్తమాన సమాచారం
ఎన్నికల డబ్బు రూ.2 కోట్లు పడేసి వెళ్లారు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారంతో ప్రచారపర్వం
ముగుస్తుండడంతో డబ్బుల పంపిణీకి
అభ్యర్థులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు
చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వారు
డబ్బులు ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో హిందూపురానికి గురువారం రాత్రి
1 గంట సమయంలో ఓ పార్టీకి చెందిన నేతలు
రూ.2 కోట్లను సంచుల్లో తీసుకొస్తుండగా
పోలీస్ సైరన్ వినిపించింది. దీంతో భయపడి
సమీపంలోని పిల్లిగుండ్లు కాలనీలోని ఆ
డబ్బును పడేసి వెళ్లిపోయారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.