నారద వర్తమాన సమాచారం
నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.
అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రులు వీరే..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్ ), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్ గఢ్ ), ఏక్ నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హర్యానా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర)తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.