నారద వర్తమాన సమాచారం
మే :22
పల్నాడు జిల్లా పోలీస్…
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ,అల్లర్లు సృష్టిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్
సార్వత్రిక ఎన్నికలు-2024 పోలింగ్ రోజున,అనంతరం మాచర్లలో జరిగిన సంఘటనల దృష్ట్యా నూతన ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ మాచర్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
అదే విధంగా పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల యొక్క శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని ముగ్గురు(3) కంటే ఎక్కువ మంది గుమికూడరాదని తెలియజేశారు.
జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర సాయుద బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లు వున్నాయని తెలియజేశారు.
జిల్లాలో ఏ పెట్రోల్ బంకు లోను విడిగా పెట్రోలు, డీజల్ అమ్మరాదని వారికి ముందస్తుగా నోటీసు ఇవ్వడం జరిగిందని అలా కాక విడిగా పెట్రోల్ అమ్మితే వారిపై చట్ట పప్రకారం చర్యలు తీసుకొని అట్టి పెట్రోల్ బంకులు సీజ్ చేస్తామని తెలియజేశారు.
ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా అందులో సుమారు 250 మంది బైండోవర్ నీ ఉల్లంఘించడం జరిగినది వీరిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీరి చేత ఆ బాండ్ అమౌంటును కట్టించడం జరుగుతుంది లేనిపక్షంలో వారంట్ తీసుకొని జైలుకు పంపడం జరుగుతుంది.
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మొత్తం 146 కేసులు కట్టడం జరిగింది దీనిలో ఇప్పటివరకు 1500 మందిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగినది, దీనిలో ఇప్పటివరకు 950 మందిని అరెస్టు చేయడం జరిగింది మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా అరెస్టు చేస్తాము దీనికి సంబంధించి ప్రత్యేక టీములను ఫామ్ చేసి ఉన్నాము.
ఈ కేసులలో సిట్ పర్యవేక్షిస్తున్న కేసులకు సంబంధించి వీడియో ఫుటేజ్ ద్వారా ఇంకొంతమంది ముద్దాయిలను చేర్చడం జరిగినది లీగల్ ఒపీనియన్ ద్వారా సెక్షన్ లను యాడ్ చేయడం జరిగినది.
ఈ రోజున జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 32 మందిని అరెస్టు చేయడం జరిగినది. పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 76 మందిని అరెస్టు చేయడం జరిగినది.
అదేవిధంగా సత్తెనపల్లి సబ్ డివిజన్లో ఈ రోజున 2 రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగినది.
అసాంఘిక శక్తులను గుర్తించుటకు జిల్లాలో ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము, ఈ కార్డెన్ సెర్చ్ లో ఈ రోజున 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 విలేజ్ లను చేయగా 49 ఎటువంటి డాక్యుమెంట్స్ లేని బైక్ లను సీజ్ చేయడం జరిగినది.
ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 32 మందిని రిమాండ్ కు పంపించాము, 44 మందికి 41సి ఆర్ పి ఎస్ నోటీస్ ఇవ్వడం జరిగినది.
అదేవిధంగా ఈ రోజున 12 పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 19 102సి ఆర్ పి ఎస్ కేసులు కట్టి 34 వెహికల్స్ మీద కట్టడం జరిగినది.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించడం జరిగినది.
శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా స్వేచ్ఛ జీవనానికి ప్రజాప్రతినిధులు,ప్రజలు, మీడియామిత్రులు సహకరించాలని పోలీసువారి ముందస్తు సూచనలు పాటించాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు గురజాల డిఎస్పి చుండూరు శ్రీనివాసరావు కేంద్ర సాయుద బలగాల కమాండెంట్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు , ఎస్ బి సీఐ , గురజాల సబ్ డివిజన్ లోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.