నారద వర్తమాన సమాచారం
మే :24
పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలక్షన్ కేసులకు సంబంధించిన పురోగతి మరియు జిల్లాలో చేసిన కార్డెన్ అండ్ సెర్చ్ వివరాలు
జిల్లాలో పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 12 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగినది. నరసరావుపేట సబ్ డివిజన్లో 18, సత్తెనపల్లి సబ్ డివిజన్లో 15, గురజాల సబ్ డివిజన్లో 06 మందిని బైండోవర్ చేయడం జరిగినది. మొత్తం జిల్లాలో 39 మందిని బైండోవర్ చేయడం జరిగినది. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఎలక్షన్ లో నేరాలు చేసిన గురజాల సబ్ డివిజన్లో కారెంపుడి మరియు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ రోజున 10 మందిపై రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరిగినది. ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా ఆ బైండోవర్ నీ ఉల్లంఘించిన 37 మందికి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయుట కొరకు నోటీసులు ఇవ్వడం జరిగినది మరియు ఇంకా 231 మందిని బైండోవర్ ఉల్లంఘించిన వారిగా గుర్తించాము వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ రోజున జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ చేయడం జరిగినది, నెంబర్ ప్లేట్ మరియు డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ నీ గుర్తించి వాటిపై 102 సి ఆర్ పి సి కింద కేసులు కట్టడం జరిగినది.
పల్నాడు జిల్లాలో అన్నీ సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించాము వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాము ఎస్పీ.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.