
నారద వర్తమాన సమాచారం
మే :24
కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడమే లక్ష్యం : పల్నాడు కలెక్టర్.
నరసరావుపేట సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్-4న ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాత్కర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో గుర్రం జాషువా సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, పోస్టల్ బ్యాలట్ నోడల అధికారులతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.








