నారద వర్తమాన సమాచారం
మే :24
ఉక్రెయిన్ పై రష్యా ఎటాక్… ఏడుగురు మృతి
రష్యా తాజాగా ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం చేసింది.
ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. గురువారం ఉదయం భారీ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు.
రష్యాది అతి కిరాతకమైన చర్యగా అభివర్ణించారు.. గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని యుద్ధం చేస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన.. పాశ్చాత్య భాగస్వామ్య దేశాల నుంచి తగిన సహకారం లభించడం లేదని నిరాశ వ్యక్తంచేశారు. రష్యా వైమానిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినన్ని రక్షణ వ్యవస్థలను సమకూర్చడంపై భాగస్వామ్య దేశాలు దృష్టి సారించడం లేదన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.