నారద వర్తమాన సమాచారం
నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
తెలంగాణ
మే :25
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్లగొండ, వరంగల్, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్య మైంది.
ఈ ఉప ఎన్నికలను రాష్ట్రం లోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. వీరితో పాటు స్వాతంత్ర్య అభ్యర్థిగా అశోక్ కుమార్ ఉన్నారు.
దీంతో ఉప ఎన్నిక మొత్తం ఈ నలుగురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు గా సాగనుంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థు లు పోటీ పడుతుండగా.. ఈ రోజు25 శనివారం 3.30 గంటలకు ప్రచారం ముగిసింది.
ఈ ఉప ఎన్నికల ఈ నెల 27న సోమవారం జరగ నుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూన్ 5న వెలువడను న్నాయి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.