నారద వర్తమాన సమాచారం
జూన్ :1
ధూమపానం మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ధూమపానం మానుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన మాట్లాడారు ధూమపానం నుంచి భవిష్యత్తు తరాలను రక్షిద్దామని ఆయన పిలుపునిచ్చారు ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయిందని ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారు ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్నారు ధూమపానం వల్ల శరీర భాగాలైన గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్నారు నాడీ సంబంధ వ్యాధులకు పక్షవాతానికి దారితీస్తున్న అన్నారు పురుషుల్లో నపుంసకత్వం, మహిళల ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి, రుతుక్రమం త్వరగా నిలిచిపోతుంది అని పేర్కొన్నారు పొగ త్రాగే అలవాట్లు మానే చిట్కాలను గూర్చి వివరించారు సిగరెట్టు తాగాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక గంట వాయిదా వేసుకోవాలని, బాగా సిగరెట్టు త్రాగాలనిపించినప్పుడు నిలబడి లేదా కూర్చొని లోతైన శ్వాస తీసుకోవాలని, అప్పుడు ఓ గ్లాసు నీళ్లు అలవాటు చేసుకోవాలని ఆయన తెలిపారు సిగరెట్టు త్రాగాలనిపించినప్పుడు నోట్లో చూయింగ్ గమ్, ఏదైనా స్వీటు, పిప్పర్మెంట్ లాంటివి పెట్టుకుని, లోతైన శ్వాస తీసుకోవటం అలవాటు చేసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పొగ త్రాగటానికి ఆకర్షితులు కాకుండా ఉండవచ్చని తెలియజేశారు