నారద వర్తమాన సమాచారం
చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల రోగాలు దరి చేరవు
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది దినచర్యలో ఒక ఆరోగ్యకరమైన పద్ధతిగా మార్చుకోవటం వల్ల రోగాల బారి నుండి తప్పించుకోవచ్చునని మంచి ఆరోగ్యాన్ని పొందటంలో చేతుల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు సచివాలయం ఒకటవ నందు గురువారం చేతుల పరిశుభ్రత ఆవశ్యకత గూర్చి జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వ్యాధులను నివారించడానికి ఇన్ఫెక్షన్ నుండి ప్రాణాలను రక్షించడానికి చేతులు పరిశుభ్రత ముఖ్యమన్నారు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, వంట చేయటానికి ముందు, ఆహారం తినుటకు ముందు, పిల్లల మలము శుభ్రం చేసిన తర్వాత, పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు, ముక్కు చీదినపుడు, పెంపుడు జంతువులను, కుక్కలను, పిల్లులను తాకినప్పుడు మొదలగు సందర్భాల్లో చేతులను బాగా సబ్బుతో శుభ్రపరచుకోవాలన్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ధన రేఖ చేతులను శుభ్రపరుచుకునే విధానం గూర్చి సోదాహరణంగా వివరించారు చేతులను శుభ్ర పరుచుకునే విధానం మణికట్టు, వేళ్ళ మధ్యలో, గోర్ల క్రింద ఎలాంటి మలినాలు లేకుండా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు ఏ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.