నారద వర్తమాన సమాచారం
జూన్ :22
ప్రజాసేవకునికి పట్టాభిషేకం
లావు శ్రీకృష్ణదేవరాయలుకి సముచిత గౌరవం
టీడీపీ పార్లమెంటరి పార్టీ నేతగా శ్రీకృష్ణ దేవరాయలు నియామకం
ప్రజాసేవకునికి పట్టాభిషేకం జరిగింది. అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ, అభివృద్ధి కోసం పరితపించే పల్నాటి రథసారథికి సముచిత గౌరవం దక్కింది. పల్నాడు రాజకీయాల్లో చరిత్రను తిరగరాసి, తన కంటూ ప్రత్యేక ముద్రను వేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలుకు మంచి పదవి దక్కింది. నిత్యం పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ప్రసంగిస్తు గుర్తింపు సాధించుకున్న శ్రీకృష్ణ దేవరాయలుకి,,
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి వరించింది. శ్రీ కృష్ణ దేవరాయలులోని పని తనానికి మెచ్చి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పదవిని ఇచ్చారు. పల్నాడులో టీడీపీ విజయకేతనంలో శ్రీ కృష్ణ దేవరాయలు కృషి ఎంతో. ఈ పదవి నాపై మరింత బాధ్యత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వద్ద మరింత కృషి చేస్తానని,, నారా చంద్రబాబు నాయుడు కి శ్రీకృష్ణ దేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి స్థానంలో నిలబెట్టిన పల్నాటి ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.