నారద వర్తమాన సమాచారం
మల్లేపల్లి అటవీ ప్రాంతంలో 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు : 2కార్లు, 2ద్విచక్రవాహనాలు సీజ్
కడప జిల్లా మల్లేపల్లి అటవీ ప్రాంతంలో 15ఎర్రచందనం దుంగలతో పాటు రెండు కార్లు, రెండు ద్వి చక్రవాహనాలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి అర్బన్ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీమ్ మంగళవారం కడప జిల్లా మల్లేపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. వీరు సమీపంలోని ఆటో నగర్ చేరుకునే సరికి అక్కడ కొందరు వ్యక్తులు రెండు కార్లలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వీరిని చుట్టుముట్టగా కొందరు పారిపోయారు. అయితే ఆరుగురు స్మగ్లర్లను పట్టుకోగలిగారు. వీరిని కడప టవునుకు చెందిన యాతగిరి హరి (42), కొప్పిలి సుధాకర్ రెడ్డి (29) తమళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన ప్రభు(30), రమేష్ (31), రవి (34), అయ్యప్పన్ మునియన్ (29)లుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలతో పాటు, 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తుల కోసం గాలింపులు చేపట్టారు. అరెస్టు చేసిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.