నారద వర్తమాన సమాచారంరామగుండంలో ఆధునిక థర్మల్ కేంద్రాన్ని నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతెలంగాణ:జూన్ 26
రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తా మని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.స్థానికంగా యువతకు ఉపా ధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగ మించేందుకు రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాల జీ తో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని, సుదీర్ఘకాలం గా పెండింగ్లో ఉన్న హామీని పూర్తి చేయాలని వారంతా కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా, స్పందిం చారు.నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మకమైన రామగుం డం థర్మల్ పవర్ స్టేషన్ ను తిరిగి నిర్మిస్తామన్నారు. పిట్ హెడ్ ప్లాంటును సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.ఈ మేరకు డిప్యూటీ సీఎం కు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాగూర్ సింగ్, ఆది శ్రీనివా స్, విజయ రమణారావు తదితరులు వినతిపత్రాన్ని అందచేశారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.